![]() |
![]() |

శ్రీహాన్ ఇంటర్ చదివే టైములో ఉన్న తన ఫస్ట్ క్రష్ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. కట్ చేస్తే ఆ అమ్మాయికి పెళ్ళైపోయి ప్రస్తుతం ఒక పాప కూడా ఉందని చెప్పాడు. ఇంటర్ లో ఉండగా ఇద్దరి మధ్య డీప్ లవ్ ఉండేదని ఐతే అది బ్రేకప్ ఐపోయిందని చెప్పాడు. "నేను ఆ అమ్మాయిని చూసిన విధానం వేరు ఆ అమ్మాయి నన్ను ఎలా చూసిందో తెలీదు. ఆ అమ్మాయే ముందుగా ప్రొపోజ్ చేసింది. మొదట్లో నో అని చెప్పాను కానీ ఏడుస్తూ బాధపడుతూ ఉంటే నేను చూడలేక కన్విన్స్ అయ్యి నేను ఓకే చెప్పాల్సి వచ్చింది.
తర్వాత అసలు ఈమెకు నేను ఎందుకు ఓకే చెప్పానా అనే బాధ కలిగింది. నన్ను ఇష్టపడింది కానీ తన మనసులో ఇంకెవరో ఉన్నారు...ఐతే ఆ విషయం గురించి నాకు తెలీదు. ఒక రోజు వీధిలో ఆమెతో మాట్లాడుతూ వచ్చి మా నాన్నకు దొరికిపోయాను..రోడ్డు మీద కాబట్టి ఏమీ అనలేదు కానీ ఇంటికి వచ్చాక బాగా క్లాస్ పీకారు. నేను ఐటిఐ చేసాను మా నాన్న నేవీలో జాబ్స్ పడ్డాయి అప్లై చేయమంటే చేశా..జాబ్ వచ్చింది. ఉదయం జాబ్ చేసి సాయంత్రం ఆడిషన్స్ కి వెళ్ళేవాడిని కానీ నాకు ఇంకా ఏదో కావాలి ఇది నా లైఫ్ కాదు అనిపించింది..నేవీలో జాబ్ చేస్తుండగా ఇక్కడ ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యింది. దాంతో నేను చాలా టెన్షన్ పడేవాడిని..నేను జాబ్ రిజైన్ చేసేసి లాంగ్ లీవ్ అని ఇంట్లో అబద్దం చెప్పి హైదరాబాద్ లో వచ్చిన ఆఫర్స్ చేసుకుంటూ ఉన్నాను..చివరికి ఏడాదిన్నర తర్వాత ఇంట్లో విషయం తెలిసింది..పేరెంట్స్ కి జాబ్ సెక్యూరిటీగా అనుకుంటారు..ఇండస్ట్రీకి వస్తే పాడైపోతారు..లైఫ్ రిస్క్ అని అనుకుంటారు. కానీ నాకు లక్కీగా ఇక్కడ ఛాన్సెస్ చూసుకునే జాబ్ రిజైన్ చేశా కాబట్టి ఇంట్లో పెద్దగా ప్రాబ్లమ్ కాలేదు... నా అసలు పేరు అహ్మద్...ఆడిషన్స్ కి వెళ్ళేటప్పుడు నా పేరు విన్నవాళ్ళ ముఖాలు మారిపోవడం చూసా..ఐతే నా పేరుతో ప్రాబ్లమ్ ఉందని తెలిసి ఇంట్లో పేరు మార్చుకోవాలి అని చెప్పగానే మా నాన్నే నాకు శ్రీహాన్ అని పేరు పెట్టారు" అంటూ తన అసలు పేరును, స్క్రీన్ పేరుని, తన ఫస్ట్ లవ్ గురించి ఎన్నో విషయాలు చెప్పాడు.
![]() |
![]() |